హైదరాబాద్ (జూలై – 02) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తూ దూర విద్య ద్వారా పీజీ చేసిన వారి ధ్రువపత్రా లకు యూజీసీ గుర్తింపు ఉందా? లేదా? అని పరిశీలించిన కమిటీ వాటి వివరాలతో కూడిన నివేదికను ఇంటర్ విద్యాశాఖకు సమర్పించారు.
కళాశాలల్లో మొత్తం 3584 మంది అధ్యాపకులు పనిచేస్తుండగా వారిలో 534 మంది దూరవిద్య ద్వారా పీజీ పూర్తి చేశారు. వారు చదివిన వర్సిటీకి, దూరవిద్యా కేంద్రానికి గుర్తింపు ఉందా? లేదా? అని పరిశీలించేందుకు ఇటీవల ఉన్నత విద్యామండలి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది.
Follow Us @