అర్హత గల వారినే క్రమబద్ధీకరించాలి – డా. పి. మధుసూదన్ రెడ్డి

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఎంటీఎస్ ఉద్యోగులలో నిబంధనల మేరకు అర్హత ఉన్న వారి సర్వీస్ ను రెగ్యులరైజ్ చేయాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మైన్ డా. పి. మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.

అర్హత లేని, నకిలీ సర్టిఫికెట్ లు గల మరియు ఉద్యోగం లో చేరిన తర్వాత పొందిన సర్టిఫికెట్ గల వారిని క్రమబద్ధీకరణ ప్రక్రియ నుంచి మినహాయించాలని స్పష్టం చేశారు.

దాని ద్వారా అర్హత గల అభ్యర్థులు మాత్రమే వ్యవస్థ లో ఉంటారని దానితో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Follow Us @