ప్రపంచ దేశాల మద్య ప్రధాన సరిహద్దు రేఖలు

★ డ్యురాండ్ రేఖ :-ఇది పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య సరిహద్దు రేఖ. 1893లో సర్ మోర్టిమర్ డ్యురాండ్ ఏర్పా టు చేశారు. ఈ రేఖను అవిభాజ్య భారత్ గుర్తించినప్పటికి ఆఫ్ఘానిస్థాన్ గుర్తించలేదు.

★ మెక్ మోహన్ రేఖ :- భారత, చైనా సరిహద్దులను నిర్ణయిస్తూ సర్ హెన్రీ మెక్ మోహన్ గీసిన సరిహద్దు రేఖ. ఈ రేఖను చైనా గుర్తించలేదు. 1962లో చైనా ఈ రేఖను ఉల్లంఘించింది.

★ ర్యాడ్ క్లిఫ్ రేఖ :- భారత్, పాకిస్థాన్ సరిహద్దును నిర్ణయిస్తూ సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ రూపొందించిన రేఖ.

★ 24వ ప్యారలల్ లైన్ :- భారతదేశంతో తమ సరిహద్దును గుర్తిస్తూ పాకిస్థాన్ ప్రకటించిన రేఖ. ఈ రేఖను భారతదేశం గుర్తించలేదు.

★ ఎల్‌.వో.సీ. (లైన్ ఆఫ్ కంట్రోల్) :- ఇండియా – పాకిస్తాన్

★ ఎల్.ఏ.సీ. (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) :-ఇండియా – చైనా

★ హిండెన్ బర్గ్ రేఖ (మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత):- ఇది జర్మనీ, పోలెండ్ మధ్య సరిహద్దు రేఖ. 1917లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ సైన్యం ఈ రేఖ వరకు దూసుకొచ్చింది.

★ ఓడర్-నిస్సీ రేఖ (రెండో ప్రపంచ యుద్ధం తర్వాత):ఓడర్, నిస్సీ నదుల వెంట జర్మనీ, పోలెండ్ దేశాలను విడదీసే సరిహద్దు రేఖ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945, ఆగస్టులో జరిగిన పోలెండ్ కాన్ఫరెన్స్ లో ఈ రేఖను నిర్ణయించారు.

★ సీజ్ ఫ్రెడ్ రేఖ:- ఫ్రాన్స్ తన సరిహద్దులను సూచిస్తూ జర్మనీ నిర్మించిన రక్షణ నిర్మాణం. దీన్ని “ఫోర్టిఫైడ్ లైన్” అని కూడా అంటారు.

★ మాజినాట్ రేఖ :- రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ దాడుల నుంచి రక్షించుకోవడానికి ఫ్రాన్స్ తన సరిహద్దుల వెంట నిర్మించుకున్న 320 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు.

★ 16వ ప్యారలల్ లైన్ :- నమీబియా, అంగోలాల మధ్య
సరిహద్దు రేఖ.

★ 17వ ప్యారలల్ లైన్ :- ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాంల మధ్య సరిహద్దు రేఖ. (ఈ రెండు దేశాల ఐక్యతకు ముందు)

★ 38వ ప్యారలల్ లైన్ :- ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సరిహద్దు రేఖ.

★ 49వ ప్యారలల్ లైన్ :- యూఎస్ఏ, కెనడాల మధ్య సరిహద్దు రేఖ.

★మానర్షియమ్ రేఖ :- రష్యా, ఫిన్లాండ్ సరిహద్దు వెంట జనరల్ మానర్షియమ్ రూపొందించారు.

Follow Us @