Oxform report – కరోనా కంటే ఆకలితోనే మరణాలు ఎక్కువ

  • ‘ది హంగర్ వైరస్ మల్టిప్లైస్’’ నివేదిక వెల్లడి
  • కరోనాకారణంగా ప్రపంచ దేశాల్లో కరువు పరిస్థితులు 6రెట్లు పెరిగిపోయింది.
  • ఆకలితో నిమిషానికి 11 మంది మరణిస్తున్నారు
  • కరోనాతో నిమిషానికి 7గురు మరణిస్తన్నారు
  • ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారు.

BIKKI NEWS : ప్రపంచ వ్యాప్తంగా పేదరిక నిర్మూలనపై కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఆక్స్ ఫామ్ జూలై 9న విడుదల చేసిన ‘‘ది హంగర్ వైరస్ మల్టిప్లైస్’’ నివేదిక (Oxform report on global hunger) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో నిమిషానికి 7గురు మరణిస్తూ ఉంటే, ఆకలితో నిమిషానికి 11 మంది మరణిస్తున్నారని తేల్చిచెప్పింది.

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, గ్లోబల్ వార్మింగ్, అంతర్యుద్ధ పరిస్థితులు ఆకలి కేకలకు కారణమని ఆక్స్ ఫామ్ స్పష్టం చేసింది.

★ ఆక్స్ ఫామ్ నివేదిక ముఖ్యాంశాలు ::

  • ఆహార కొరతని ఎదుర్కొంటున్న వారిలో దాదాపుగా 66 శాతం మంది మిలటరీ సంక్షోభం నెలకొన్న దేశాల్లోనే ఉన్నారు.
  • ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 2 కోట్లు పెరిగింది.
  • కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులతో 5 లక్షల 20 వేల మంది ఆకలితో అలమటిస్తున్నారు.
  • కరోనా ప్రభావం, వాతావరణ మార్పులతో గత ఏడాదికాలంలోనే ఆహార ఉత్పత్తుల ధరలు 40 శాతం పెరిగాయి.
  • గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో కరువు పరిస్థితులు 6రెట్లు పెరిగిపోయాయి.
  • కరోనా కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై చేసే ఖర్చు 5,100 కోట్ల డాలర్లు పెరిగింది.
  • ఆకలిని నిర్మూలించడానికి ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన ఖర్చు కంటే మిలటరీపై చేస్తున్న ఖర్చు 6 రెట్లు ఎక్కువ.
  • అఫ్గానిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ దేశాల్లో ఆకలి కేకలు అత్యధికంగా ఉన్నాయి.