ASHES : ఇంగ్లండ్ లక్ష్యం 250 పరుగులు

లీడ్స్ (జూలై – 08) : the ashes 2023 3rd test రమూడో రోజు ఆస్ట్రేలియా జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు లక్ష్యం 250 పరుగులుగా ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కావునా ఫలితం తథ్యం. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిస్తే 2023 ashes విజేతగా నిలుస్తోంది. ఇంగ్లండ్ ఎంతవరకు ఆసీస్ గెలుపు ఆపుతుందో చూడాలి.

మూడవ రోజు ఆటలో కూడా బౌలర్ల హవా నడిచింది. స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ మూడేసి వికెట్లు, ఆలీ, ఉడ్స్ రెండేసి వికెట్లు తీశారు.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ లలో ట్రావిస్ హెడ్ (77), ఖావాజా (43) లబూషెన్ (33) పరుగులు సాదించారు.

పాట్ కమ్మిన్స్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 237 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో ఇంగ్లాండ్ జట్టు 142 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లంచ్ విరామం తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (80), మార్క్ ఉడ్ t20 తరహా buzz ball cricket ఆడటంతో మొదటి ఇన్నింగ్స్ అంతరాన్ని తగ్గించ గలిగారు. మార్క్ ఉడ్ ఎనిమిది బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలలో పాట్ కమ్మిన్స్ 6 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశారు.

మిచెల్ మార్ష్ సెంచరీ (118) సహాయంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ – 5, క్రిస్ వోక్స్ – 3, బ్రాడ్ – 2 వికెట్లు తీశారు.