ASHES : ఇంగ్లండ్ ను కాపాడిన బజ్ బాల్ క్రికెట్

లీడ్స్ (జూలై – 07) : the ashes 2023 3rd test రెండో రోజు పాట్ కమ్మిన్స్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ 237 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 26 పరుగుల ఆధిక్యత సాదించింది.

ఒక దశలో ఇంగ్లాండ్ జట్టు 142 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లంచ్ విరామం తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (80), మార్క్ ఉడ్ t20 తరహా buzz ball cricket ఆడటంతో మొదటి ఇన్నింగ్స్ అంతరాన్ని తగ్గించ గలిగారు. మార్క్ ఉడ్ ఎనిమిది బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలలో పాట్ కమ్మిన్స్ 6 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశారు.

మిచెల్ మార్ష్ సెంచరీ (118) సహాయంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ – 5, క్రిస్ వోక్స్ – 3, బ్రాడ్ – 2 వికెట్లు తీశారు.