లార్డ్స్ (జూన్ – 29 : The Ashes 2023 లో భాగంగా ENGLAND vs AUSTRALIA జట్ల మద్య జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో ,416 పరుగులకు ఆలౌట్ అయింది.
రెండో రోజు ఆటలో స్టీవ్ స్మిత్ (110) సెంచరీతో రాణించాడు. టంగ్, రాబిన్సన్ చెరో మూడు వికెట్లు తీశారు.
స్టీవ్ స్మిత్ కి ఇది కేవలం యాషెస్ సిరీస్ లలో 12 వ సెంచరీ కావడం విశేషం. మొత్తం మీద స్టీవ్ స్మిత్ కి 32 వ టెస్ట్ సెంచరీ. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో (174) 32 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ గా రికార్డు సృష్టించాడు.