పీఆర్సీ కమిటీకి కృతజ్ఞతలు – కనకచంద్రం

తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం PRC కమిటీకి కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు బేసిక్ పే తో పాటు DA మరియు HRA ఇవ్వాలని, 010 పద్దు కింద జీతాలు ఇచ్చినట్లయితే నెల నెలా జీతాలు వస్తాయని పీఆర్సీ కమీటికి గతంలో సంఘం తరపున నివేదించారు.

హెల్త్ డిపార్ట్మెంట్ లో బేసిక్ పే తోపాటు DA మరియు HRA మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని వివరిస్తూ అదేవిధంగా గత 19 సంవత్సరాలుగా కాంట్రాక్టు అధ్యాపకుల జీవన విధ్వంసం జరిగిందని ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికైనా క్రమబద్దీకరణ చేసి న్యాయం చేయాలని PRC కమిటీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి దానికి సంబంధించిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన ప్రతులను కమిటీ కి ఇవ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో విన్నపాలను కమిటీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి నివేదించడం పట్ల యావత్ కాంట్రాక్టు అధ్యాపకుల తరపున PRC కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కనకచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు.

PRC కమిటీకి సీజేఎల్స్ ప్రతిపాదనలు విన్నవిస్తున్న కనకచంద్రం

Follow Us@