హైకోర్టు తీర్పు పట్ల హర్షం తెలిపిన బుర్రి రాజు, గంగాధర్

ఆదిలాబాద్ :: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను, లెక్చరర్లను క్రమబద్దీకరణ చేయటానికి జీవో నెంబర్ 16 విడుదల చేయడం జరిగింది. క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ వేయగా హైకోర్టు ఆ పిల్ ను తాజాగా కొట్టివేసి క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేయడం పట్ల బుర్రి రాజు, గంగాధర్ లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో ప్రభుత్వంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్ల తరఫున ఆర్జేడీ నియమిత సిజేఎల్స్ సంఘము హైకోర్టులో ఇంప్లీడ్ కావడం జరిగిందని, ఈ కేసు అనేక వాయిదాల తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులకి/ లెక్చరర్లకు అనుకూలంగా పిల్ ను కొట్టివేసిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు తీర్పును అనుసరించి వెంటనే కాంట్రాక్టు లెక్చరర్స్ ను క్రమబద్దికరించాలని. ఆర్. జే. డి కాంట్రాక్ట్ లెక్చరర్ సంఘ
రాష్ట్ర కోశాధికారి బుర్రి రాజు మరియు జిల్లా అధ్యక్షులు గంగాధర్ లు ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us @