కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిక్ పే కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు – ఆర్జేడీ సంఘం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు నూతన పీఆర్సీ ప్రకారం బేసిక్ పే కల్పించడం పై ఆర్జేడీ నియమిత కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం తరపున గాదె వెంకన్న, కుమార్ లు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యంగా 30% మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనం పెంపు ఉంటుందని వస్తున్న వార్తల నేపథ్యంలో హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తమకు బేసిక్ పే కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నూతన పీఆర్సీ ప్రకారం రెగ్యులర్ లెక్చరర్ లతో సమానంగా బేసిక్ పే కల్పించడం పట్ల సీఎం కేసీఆర్ కి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు కాంట్రాక్టు అధ్యాపకుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

Follow Us@