డిగ్రీ గురుకులాల ప్రవేశానికి (TGUG CET) నమోదు గడువు పెంపు.

తెలంగాణ రాష్ట్రంలోని 30 – తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు 17 – గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో (TSWRDC & TTWRDC) ప్రథమ సంవత్సరంలో చేరడానికి డిగ్రీ గురుకులాల ప్రవేశానికి పరీక్ష (TGUGCET 2021) కొరకు నమోదు గడువును మార్చి – 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

2020 లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు మరియు 2021లో ఉత్తీర్ణత సాధించేవారు అర్హులు. కేవలం 100 రూపాయలు మాత్రమే పరీక్ష ఫీజు గా గలదు. దీనికి గ్రామీణ ప్రాంతాల్లో (రూరల్) ఉన్న తల్లిదండ్రుల ఆదాయం లక్షా యాభై వేలు (1.5 lack), పట్టణ ప్రాంతాల్లో ( అర్బన్) ఉన్న తల్లిదండ్రుల ఆదాయం రెండు లక్షలు(2 lacks) కలిగియున్న వారు అర్హులు.

సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ గురుకులాల్లో విద్యనభ్యసించే విద్యార్థినులందరికి ఉచిత విద్యతో పాటు ఇతర సదుపాయాలన్నింటిని మరియు కోచింగ్ క్యాంపులు, విదేశాలలో ఉన్నత విద్య ప్రవేశం కొరకు GRE శిక్షణ మొదలగు వాటిని ఏర్పరచి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

WEBSITE :: http://mmtechies-001-site3.itempurl.com/start.html

Follow Us@