జూలై 16న గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు

ఫలితాలు కోసం క్లిక్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TGUGCET – 2021 ప్రవేశ పరీక్ష ఫలితాలను జులై 16న విడుదల చేయనున్నట్లు కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు ఉంటాయని తెలిపారు.

ప్రవేశాల కోసం మొదటి దశ కౌన్సెలింగ్ జూలై 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అలాగే సీటు పొందిన విద్యార్థులు టీసీ, కుల, ఆదాయ సర్టిఫికెట్ లు, ఇంటర్ మార్కుల మెమో, పాస్ పోర్ట్ సైజు ఫోటో తీసుకొని కళాశాలలో సందర్శించి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.