డిగ్రీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు యూనివర్సిటీ వాతావరణంతో నాణ్యమైన ఉచిత విద్యను, హస్టల్ సౌకర్యాలను అందించే లక్ష్యంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ గురుకులాలలో ప్రథమ సంవత్సరానికి గాను 2021 – 22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

దీనికి సంబంధించి తెలంగాణ గురుకుల యూజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGUG CET 2021) ప్రవేశ నోటిఫికేషన్ విడుదలైంది.

రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిల కోసం నాలుగు స్పెషలైజ్డ్ గురుకుల డిగ్రీ కళాశాలలు, 24 సాధారణ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు, 15 ట్రైబల్ వెల్ఫేర్ మహిళా రెసిడెన్షియల్ కాలేజీలు, అబ్బాయిల కోసం 7 ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.

● అందించే కోర్సులు :: బిఏ, బీకాం, బిఎస్సీ, బిబిఏ..

● అర్హతలు :: 2021 – 22 లో ఇంటర్ ఎగ్జామ్స్ కు హాజరవుతున్న విద్యార్థులు. ఇప్పటికే ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 40 శాతం మార్కులతో పాసైన వారు అప్లై చేసుకోవచ్చు.

● ఎంపిక విధానం :: TGUG CET 2021 లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.

● సిలబస్ :: ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంగ్లిష్ తో పాటు మూడు ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కులు చొప్పున 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండున్నర గంటల పాటు పరీక్ష ఉంటుంది.

● దరఖాస్తు విధానము :: ఆన్లైన్లో

● దరఖాస్తుకు చివరి తేదీ::
మార్చి – 5 – 2021

● హాల్ టికెట్ డౌన్లోడ్ :: ఏప్రిల్ – 15 – 2021

● పరీక్ష తేదీ:: ఏప్రిల్ – 25 – 2021

● పరీక్ష ఫీజు :: 100 రూపాయలు

● వెబ్సైట్ :: http://mmtechies-001-site3.itempurl.com/start.html

● నోటిఫికేషన్ pdf :: https://drive.google.com/file/d/1gwZfJyUBaQKsexF9KedIJruEpQWlx_qX/view?usp=drivesdk

Follow Us@