BIKKI NEWS (JUNE 16) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురుకులాల్లో భర్తీ చేయనున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ – 1, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ – 2, వార్డెన్ గ్రేడ్ – 1 & గ్రేడ్ – 2 మరియు మాట్రాన్ గ్రేడ్ – 1 & గ్రేడ్ – 2 మరియు లేడీ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల తేదీని వెల్లడించింది. tgpsc hostel welfare officers and warden jobs exam dates
ఈ పరీక్షలను జూన్ 24 నుండి 29 వరకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 581 ఉద్యోగాలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే
జూన్ 24 నుండి 29వ తేదీ వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
ఉదయం సెషన్ 10.00 – 12.30 వరకు, మధ్యాహ్నం సెషన్ -2.30 – 5.30 వరకు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను పరీక్షకు మూడు రోజుల ముందు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్ తో పాటు కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రాలకు హాజరు కావలసి ఉంటుందని కమిషన్ ప్రకటించింది.