BIKKI NEWS (JUNE 24) : TGPSC – GROUP 1 OMR IMAGING SHEETS LINK. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష యొక్క ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఈ గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3,02,172 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు ఈ నెల 24 సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లో వివరాలు నమోదు చేసి వాటిని పొందవచ్చని సూచించారు.
రాష్ట్రంలో 563 పోస్టులతో కూడిన గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనకు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 74.86 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని నవీన్ నికోలస్ ప్రకటించారు. అత్యధికంగా వనపర్తిలో 82.74 హాజరు శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 61.78 శాతం నమోదైందని తెలిపారు.