BIKKI NEWS : TGPSC GROUP – 1 MAINS SYLLABUS PDF and EXAM PATTERN. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 563 గ్రూప్ 1 పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ ను ఈ రోజు విడుదల చేసింది. పోస్టుల సంఖ్యకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేయనున్నారు.
గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల్లో ఆరు ప్రధాన సబ్జెక్టులతో పాటు జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉండనుంది. ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించిన వారి మిగతా 6 పేపర్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని కరెక్షన్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ పరీక్షలకు ఇంటర్వ్యూలు లేవు.
క్వాలిఫయింగ్ టెస్టు – ఇంగ్లీష్ పరీక్ష పదవ తరగతి స్టాండర్డ్ లో 150 మార్కులకు ఉండనుంది. ఇది కేవలం క్వాలిఫయింగ్ టెస్టు మాత్రమే. ఈ మార్కులను మెయిన్స్ లో సాదించిన మొత్తం మార్కులలో కలపరు.
మెయిన్స్ లో మొత్తం 6 పేపర్స్ ఉండనున్నాయి. ప్రతి పేపర్ కు 150 మార్కుల చొప్పున 900 మార్కులకు మెయిన్స్ పరీక్షలు ఉండనున్నాయి.
అభ్యర్థులు ప్రతి పేపర్ లో మూడు వ్యాసాలను రాయవలసి ఉంటుంది. మూడు సెక్షన్ల లలో ప్రతి సెక్షన్ నుండి 1 వ్యాసరూప సమాధానం రాయవలసి ఉంటుంది. ప్రతి సమాదానానికి 50 మార్కుల చొప్పున 150 మార్కులు ఉండనున్నాయి.
ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక లో కేవలం ఈ ఆరు పేపర్లలో సాదించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ మరియు క్వాలిఫయింగ్ ఇంగ్లీష్ పరీక్షలలో సాదించిన మార్కులను కలపరు.
★ పేపర్ – 1 : జనరల్ ఎస్సే ఇంగ్లీష్
★ పేపర్ – 2: హిస్టరీ, కల్చర్ & జాగ్రపి
★ పేపర్ – 3 : ఇండియన్ సోసైటీ, కానిస్టిట్యూషన్ మరియు గవర్నెన్స్
★ పేపర్ – 4 : ఎకానమీ & డెవలప్‌మెంట్
★ పేపర్ – 5 : సైన్స్ & టెక్నాలజీ & డేటా ఇంటర్‌ప్రిటేషన్
★ పేపర్ – 6 : తెలంగాణ మూవ్‌మెంట్ & స్టేట్ ఫార్మేషన్