BIKKI NEWS (MAR. 08) : TGPSC EXAMS RESULTS DATES 2025. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఉద్యోగ పరీక్షల ఫలితాల తేదీలను ప్రకటించింది.
TGPSC EXAMS RESULTS DATES 2025.
గ్రూప్ – 1, గ్రూప్ – 2, గ్రూప్ – 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ , ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలు ప్రకటించే తేదీలను ప్రకటించింది.
మార్చి 10న గ్రూప్ -1 ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల.
మార్చి 11న గ్రూప్ – 2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
మార్చి 14న గ్రూప్ – 3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల
మార్చి 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల
అలాగే ఈ గ్రూపు – 1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను, ప్రచారాలను నమ్మవద్దని ఒక ప్రకటనలో బుర్ర వెంకటేశం తెలిపారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మధ్యవర్తులు ఇచ్చే హామీలు, ప్రకటనలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఇలాంటి హామీలు ఇచ్చేవారి సమాచారాన్ని 99667003394 నెంబర్ కు వెంటనే సమాచారం ఇవ్వాలని లేదా vigilance@tgpsc.gov.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE