TGPSC – CDPO, ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ పరీక్షలు రద్దు

BIKKI NEWS (JULY 19) : TGPSC CANCELLED CDPO and EXTENSION OFFICER EXAMS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో విడుదల చేసిన రెండు నోటిఫికేషన్ల కోసం నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

TGPSC CANCELLED CDPO and EXTENSION OFFICER EXAMS

CDPO నోటిఫికేషన్ (13/2022) మరియు ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ నోటిఫికేషన్ (11/2022) లకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ పరీక్షల నిర్వహణపై సెంట్రల్ పోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ మరియు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన నివేదికలు ఆధారంగా పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

CDPO నోటిఫికేషన్ కు సంబంధించి రాత పరీక్ష ను జనవరి 03 – 2023 న మరియు ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ కు సంబంధించి రాత పరీక్షను జనవరి 08 – 2023 న నిర్వహించారు. ఈ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నోటిఫికేషన్ లకు సంబంధించి పరీక్షలను మళ్లీ నిర్వహించడానికి త్వరలోనే షెడ్యూలు విడుదల చేస్తామని, కావున అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి సన్నద్ధం అవ్వాలని పేర్కొన్నారు.

ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ద్వారా 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. CDPO నోటిఫికేషన్ ద్వారా 23 పోస్టులను భర్తీ చేయనున్నారు.