TGPLA – C నూతన కాలెండర్ ను ఆవిష్కరించిన కమీషనర్

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ ఈరోజు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ చేతుల మీదగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరింపజేశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమా శంకర్, అరుణ్ ఇమాన్యుల్ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ల పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

ముఖ్యంగా 433 మంది పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లను జీవో నెంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరించడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది.

క్రమబద్దీకరణ కోసం పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ల 433 మందితో కూడిన కొత్త లిస్టు తయారు చేయాలని కోరడం జరిగింది.

కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇకముందు లెక్చరర్ (C) అని గుర్తించాలని విన్నవించడం జరిగింది.

పై అంశాల మీద సానుకూలంగా స్పందించిన కమిషనర్ క్రమబద్ధీకరణకు సంబంధించి 433 మందితో కూడిన కొత్త లిస్ట్ తయారు చేసినట్లు, అలాగే ఇక నుంచి లెక్చరర్ (C) అని మార్చడానికి అంగీకరించారని ఉమా శంకర్, అరుణ్ ఇమాన్యుయోల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు అరుణకుమారి, రియాజ్, సంతోష్, వినీల్, సురేష్, రాజరాజేశ్వరి, సుష్మశ్రీ, సరిత, వందన, శ్రీనివాస్, వేణు, మోసిన్ బేగ్, భార్గవి, ఎం వెంకన్న, విజయ్, సునీల్, శ్రీనివాస్, చక్రవర్తి, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.