TGOS – ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరకు చొరవ చూపండి – సీఎస్ కు వినతి

BIKKI NEWS (MAY 03) : TGOS met TG CS RAMAKRISHNA RAO ON EMPLOYEES ISSUES. తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శ రామకృష్ణారావు, IAS, గారిని ఈరోజు కలిసి అభినందనలు తెలియచేయడం జరిగిందని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు మరియు ఏ. సత్యనారాయణ తెలిపారు.

TGOS met TG CS RAMAKRISHNA RAO ON EMPLOYEES ISSUES

ఈ నేపథ్యంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల పలు సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధనకై గత 16 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను, మంత్రులను మరియు అధికారులను పలుసార్లు కలిసిన ఫలితం లేదని తెలియజేశారు.

ఉద్యోగుల ప్రధాన సమస్యలు

పెండింగ్ లో ఉన్న 5 D.A లను వెంటనే విడుదల చేయాలి..

పెండింగ్ లో ఉన్న 10 వేల కోట్ల బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలి.

ఏప్రిల్ – మే నెలలోనే సాధారణ బదిలీలను చేపట్టాలి.

సమయానికి DPC లను ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించాలి.

PRC కమిటీ నివేదికను ప్రభుత్వం తెప్పించుకొని 51% ఫిట్మెంట్ ను వెంటనే అమలు చేయాలి.

ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు (EHS) వెంటనే అమలు చేయాలి.

జి.వో. 317 ను సమీక్షించి బాధితుల బదిలీల కొరకు సూపర్ న్యూమరీ పోస్టులను కల్పించి వీలైనంత త్వరగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి వారి స్థానిక జిల్లా/జోనులను కేటాయించాలి.

కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీమ్ రద్దు చేసి (CPS & UPS) పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలీ.

క్రమశిక్షణా కేసులు ఎదురుకుంటున్న ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి.

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 57 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.

ఈ సమస్యలపై ప్రధాన కార్యదర్శి గారు చాలా సానుకులంగా స్పందించారని తెలిపారు.

ఈ కార్యక్రమములో ఏ. సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ, బి. శ్యామ్, అసోసియేట్ అధ్యక్షులు, ఏం ఉపేందర్ రెడ్డి కోశాధికారి, రామకృష్ణ గౌడ్, నరహరి, దీపారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, కోటజీ, శ్రీనివాస మూర్తి గండూరి వెంకటేశ్వర్లు, ఏం బి కృష్ణ యాదవ్, డా కె రామారావు, వినోద్ కుమార్, శ్రీనేష్ కుమార్, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు