BIKKI NEWS (MAY 04) : 40% ఫిట్‌మెంట్ తో రెండో పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ సంఘం రెండో పీఆర్సీ కమిటీ చైర్మన్ ను కలిసి వినతిపత్రం (TGO REQUESTS FOR 40%. FITMENT IN 2nd PRC) సమర్పించింది.
ఉద్యోగులపై పెట్టే ఖర్చును రెవెన్యూ వ్యయం పేరుతో అప్రాధాన్య ఖర్చుగా కాకుండా పెట్టుబడి వ్యయంగా పరిగణించాలి తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం పేర్కొంది
ఉద్యోగుల కనిష్ఠ వేతనం రూ.32 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,95,460 ఉండాలని, పే స్కేల్ నిర్ధారణకు ఆ పోస్టుకు సంబంధించిన కనీస వేతనం, 1-7-2023 నాటికి ఉన్న డీఏ, ఫిట్‌మెంట్‌ను కలిపి నిర్ధారించాలని సూచించింది.
ఫిట్‌మెంట్ 40శాతం, వార్షిక ఇంక్రిమెంట్ రేటు 2.6 – 3 శాతం ఉండేలా చూడాలని కోరింది. ఈ మేరకు రెండో పీఆర్సీ చైర్మన్ ఎన్.శివశంకర్‌కు టీజీవో సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ఉద్యోగుల డిమాండ్లతో కూడిన నివేదికను శుక్రవారం అందించారు.