BIKKI NEWS (FEB. 20) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక (TGO NEW STATE BODY IS FORMED) ఈరోజు హైదరాబాదులో జరిగింది. నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ, అసోసియోట్ అధ్యక్షుడిగా బి. శ్యామ్, ఉపాధ్యక్షుడుగా జగన్మోహన్ రావు,. కోశాధికారిగా ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా పరమేశ్వర్ రెడ్డి, మహిళ ప్రతినిధిగా దీపా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మాచర్ల రామకృష్ణ గౌడ్, కార్యనిర్వాహక సభ్యుడిగా యాదగిరి గౌడ్ నియామకం జరిగింది.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగులకు అనువైన పిఆర్సిని మరియు ఇతర న్యాయబద్ద హక్కులను నెరవేర్చడానికి కృషి చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే గెజిటెడ్ అధికారుల సంక్షేమం కోసంఅహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు, ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లింపుకు కృషి చేస్తామని, 317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగులకు తగిన న్యాయం చేసేలా కృషి చేస్తామని, పెండింగ్ డీఏ ల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి