BIKKI NEWS (FEB. 25) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO LEADERS MET CM REVANTH REDDY) నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలకు ముందే పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల్లో ఒక డీఏను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇటివలే నూతనంగా ఎన్నికైన టీజీవో కార్యవర్గ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్‌రావు, ఏనుగుల సత్యనారాయణ నేతృత్వంలో ప్రతినిధి బృందం శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, డీఏ ఏరియర్స్‌ను చెల్లించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. సీపీఎస్ రద్దు, సాధారణ బదిలీలు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎంను కోరామని టీజీవో సంఘం బాధ్యులు తెలిపారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి