Home > LATEST NEWS > TGLA రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు

TGLA రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు

హైదరాబాద్ (డిసెంబర్ – 24) : తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని (TGLA STATE BODY) ఆదివారం హైదరాబాదులో ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా గాదె వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యార కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామచంద్రారెడ్డి, కోశాధికారిగా పిడమర్తి ఉపేందర్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా రజిని, కార్యనిర్వహక కార్యదర్శిగా గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా యుగంధర్, శ్రీపతి సురేష్ బాబు, చంద్రశేఖర్, ప్రచార కార్యదర్శిగా సతీష్ లు జాయింట్ సెక్రటరీ గా మోతే సమ్మయ్య, హరిబాబు, అనిల్ రెడ్డి సెక్రటరీ గా నర్సిరెడ్డి లు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు గాదె వెంకన్న, యారా కుమారులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ బలోపేతానికి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధిక సంఖ్యలో అడ్మిషన్లు, ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో తీవ్రంగా శ్రమిస్తామని, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కొరకు తమ సంఘం పాటుపడుతుందని పేర్కొన్నారు.