Home > UNCATEGORY > ఉపాధ్యాయ గొంతుకు అలుగుబెల్లి నర్సిరెడ్డికి మద్దతు – TGJLA_475

ఉపాధ్యాయ గొంతుకు అలుగుబెల్లి నర్సిరెడ్డికి మద్దతు – TGJLA_475

BIKKI NEWS (OCT. 11) : TGJLA supports Alugubelli in mlc elections. అసెంబ్లీలో ఉపాధ్యాయ గొంతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మద్దతిస్తున్నట్టు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు .

TGJLA supports Alugubelli in mlc elections

ఈరోజు హనుమకొండలోని హంటర్ రోడ్ లో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఆఫీసులో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పరిచయ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల గురించి శాసనమండలిలో నిక్కచ్చిగా, స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడుతూ
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. అసెంబ్లీలోనే మరియు బయట ఉపాధ్యాయులు, అధ్యాపకులు చేస్తున్న ఉద్యమాలకు చేయూతనిస్తూ ఉద్యమాల్లో పాల్గొంటూ పోలీసులు అరెస్టు ఎదుర్కొంటు తన ఎమ్మెల్సీ సమయాన్ని మొత్తాన్ని నిజాయితీగా ఉపాధ్యాయ ఉద్యమాలకు కేటాయిస్తున్నారని, అదేవిధంగా తనకు వచ్చే నియోజకవర్గ నిధుల్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో గత 20 సంవత్సరాలు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్ధీకరణలో తన వంతు సహకారం అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ విద్యా, వైద్య రంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ -475 రాష్ట్ర కమిటీ శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ -475 రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి, రాష్ట్ర మహిళా నాయకులు రమాదేవి, శోభ, వరంగల్, హనుమకొండ, జనగామ, మానుకోట, భూపాలపల్లి,
ములుగు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాతూరు రాజిరెడ్డి, విజయ మోహన్, పింగళి శ్రీనివాస్, గణేష్, వేముల రవీందర్, అనిల్, హరి గోపాల్ మరియు రాష్ట్ర రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సునీల్, చిట్టిమల్ల భాస్కర్, గణేష్, రహీం , వీరాంజనేయులు, శ్రీధర్ తెలంగాణ ఒకేషనల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు