BIKKI NEWS (MAY 01) : TGJLA requested Akunuru Murali for gjcs development. ఈరోజు హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషనర్ కార్యాలయంలో విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరు మురళి, ఐఏఎస్ గారిని మరియు విద్యా కమిషన్ సభ్యులు శ్రీ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారిని, ఇతర అధికారులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి మరియు విద్యార్థుల అడ్మిషన్ పెరగటానికి చేపట్టవలసిన, అందించవలసిన సహకారం గురించి పలు సూచనలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగిందని TGJLA_475 ASSN రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పశెట్టి సురేష్ తెలిపారు.
TGJLA requested Akunuru Murali for gjcs development
విద్యార్థులకు జూన్ 2 నుంచి మధ్యాహ్నం భోజన పథకం పెట్టాలని, ప్రతినెలా స్కాలర్షిప్లు అందించాలని, కామన్ యూనిఫామ్ పంపిణీ చేయాలని, 26 జిల్లాలకు డిఐఈఓ పోస్టులు శాంక్షన్ చేసి భర్తీ చేయాలని,నూతనంగా సాంక్షన్ చేసిన 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, టీచింగ్, నాన్ -టీచింగ్ పోస్ట్ శాంక్షన్ చేయాలని, నూతన కాంబినేషన్స్ తో కోర్సులు శాంక్షన్ చేయాలని, ఇంకా పలు సూచనలతో వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు.
విద్యా కమిషన్ చైర్మన్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఈ విషయాలపై ప్రభుత్వానికి సిఫారసులు పంపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, తెలంగాణ ఉన్నత విద్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అందే సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగీత, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్, విశాలాక్ష్మి, జిల్లా నాయకులు ప్రేమ్ సాగర్, సునీల్, డా అమ్మిన శ్రీనివాసరాజు, నగేష్, గిర్ని రాజు తదితరులు పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్