వరంగల్ ,ఖమ్మం, నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ A నర్సిరెడ్డికి సంపూర్ణ మద్దతు – TGJLA_475

BIKKI NEWS (OCT. 09) : TGJLA 475 SUPPORTING TEACHER MLC A NARSIREDDY. ఉపాధ్యాయ ఉద్యమ నేత ఉపాధ్యాయ, అధ్యాపక సామాజిక సేవా తత్పరుడు, నిజాయితీ, నికార్సాయన వ్యక్తి తన పదవిని విద్యారంగ పరిరక్షణకు, సామాజిక ఉద్యమాలకు అంకితం చేస్తున్న అలుగువెల్లి నర్సిరెడ్డి మరోసారి ఖమ్మం నల్లగొండ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

ఈరోజు ఖమ్మం పట్టణంలో TSUTF ఆఫీసులో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంల తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ 475 తరఫున శుభాకాంక్షలు అభినందలు తెలియజేస్తూ, అనేక ఉపాధ్యాయ ఉద్యమాలలో మరియు ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కొరకు ప్రభుత్వ వైద్య రంగ అభివృద్ధికి తన సాయి శక్తుల కృషిచేస్తూ ,ఏ సమస్యలైనా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటం మరియు అవసరమైతే ఉద్యమాలకు సహకరిస్తూ, నిజాయితీగా నికారుసుగా ఉన్న
శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, త్వరలో ఖమ్మం నల్గొండ ,వరంగల్ టీచర్ నియోజక వర్గానికి త్వరలో జరగబోవు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో శ్రీ ఏ నర్సి రెడ్డి గారి గారి విజయానికి సంపూర్ణంగా కృషి చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుమ్మడి మల్లయ్య, కొండ వినోద్ బాబు, మహబూబాద్ జిల్లా అధ్యక్షులు డి రవి కిరణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచర్ల శ్రీకాంత్, తోట నాగేశ్వరరావు, రాంబాబు మరియు ఇతర నాయకులు అడపాల ప్రసాదరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు లక్ష్మణ్
తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు