Home > UNCATEGORY > మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలంటూ సీఎంకు వినతి

మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలంటూ సీఎంకు వినతి

BIKKI NEWS (JAN. 30) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బలోపేతం కొరకు ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఏ. నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ 475 సంఘం హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏ. రేవంత్ రెడ్డి గారిని కలిసి (TGJLA 475 LEADERS MET CM REVANTH REDDY) విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, డాక్టర్ కుప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

ఈరోజు సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి తెలంగాణలోని 412 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టాలని, స్కాలర్షిప్లు ప్రతినెల విద్యార్థులకు అందేటట్లు చూడాలని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు పెరిగిన దృష్ట్యా ఇంటర్ విద్యను బలోపేతం చేయడానికి జిల్లా ఇంటర్ విద్యా పర్యవేక్షకుల పోస్టులు శాంక్షన్ చేయాలని, ప్రభుత్వ కళాశాలలో దైనందిన నిర్వహణ కొరకు క్రమబద్ధంగా గ్రాంటు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే నియమించాలని, ప్రతి కళాశాలకి విద్యార్థిని విద్యార్థులకు టాయిలెట్స్ మరియు ప్రహరీ మరియు గేట్లు ఏర్పాటు చేయాలని, నైట్ వాచ్‌మెన్ లను నియమించాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి అధికారులు అధ్యాపక సంఘాలు విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించాలని వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు

ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో వివిధ కారణాలతో క్రమబద్దీకరణ కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ వృత్తివిద్య కోర్సులో 41 మంది కోర్సులో పనిచేస్తున్న 23 మందిని, ఉర్దూ మీడియంలో లాంగ్వేజి సమస్య ఎదుర్కొన్న 13 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు అర్హతలు ఉండి ఎన్నికల కోడ్ వలన క్రమబద్ధీకరణ ఆగిపోయిన సుమారు 150 మందిని, డిగ్రీ కళాశాలలో అదనపు అర్హతలు లేని 515 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు రిలాక్సేషన్ ఇచ్చి మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరణ చేయవలసిందిగా వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి. శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్,- వర్కింగ్ ప్రెసిడెంట్ కెపి శోభన్ బాబు, మహిళా కార్యదర్శులు సంగీత, విశాలాక్ష్మి తదితరులు పాల్గొన్నారు.