BIKKI NEWS (DEC. 28) : TGJLA 475 COMPLAINT AGAINST INTERPRETATORS OF HIGHCOURT VERDICT. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్స్, ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై తెలంగాణ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వమునకు మరియు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సమితి (రిజిస్ట్రేషన్ నెంబర్ 561/2023) అధ్యక్ష, కార్యదర్శులు సైదులు రెడ్డి, వేముల శేఖర్ ఈరోజు ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.
TGJLA 475 COMPLAINT AGAINST INTERPRETATORS OF HIGHCOURT VERDICT
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్ధీకరించడానికి 2016 లో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 16 జారీ చేయడం జరిగిందని తెలుపుతూ… గతంలో గౌరవ సుప్రీంకోర్టులో క్రమబద్ధీకరణ పై సానుకూలమైన తీర్పు రావడంతో 2023 మే నెలలో కాంట్రాక్ట్ లెక్చరర్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం జరిగిందని తెలిపారు. అనంతరం క్రమబద్ధీకరణ పై కొంతమంది గౌరవ హైకోర్టులో కేసులు వేయగా పిటిషన్ నెంబర్స్ 10744, 11643, 13223, 14300, 10744, కేసులో 19/11/2023 గౌరవ తెలంగాణ హైకోర్టు తుది తీర్పునిస్తూ ఇప్పటివరకు క్రమబద్ధీకరణ జరిగిన వారిని తొలగించవద్దని, భవిష్యత్తులో కాంట్రాక్టు ఉద్యోగులు జీవో నెంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరించవద్దని తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
కాని ప్రభుత్వ ఉద్యోగులు అయికూడా సైదులు రెడ్డి, వేముల శేఖర్ లు గౌరవ హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ రెగ్యులర్ అయిన వారికి వేతనాలు ఇవ్వవద్దని వీరి క్రమబద్దీకరణను గౌరవ హైకోర్టు కొట్టి వేసిందని, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు మరియు అధికారులకు వివిధ సామాజిక మాధ్యమాల్లో వారి యొక్క సంఘ లెటర్ ప్యాడ్ ద్వారా ప్రచారం చేస్తూ క్రమబద్ధీకరణ అయిన లెక్చరర్స్ ఉద్యోగులలో, వారి కుటుంబాలలో మానసిక ఆవేదన కారణమవుతున్నారని తెలుపుతూ స్టేషన్ లో పిర్యాదు చేశారు.
వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలోనే గౌరవ ఇంటర్వ్యూ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని అయినా మీరు తమ చర్యలు ఆపకపోవడంతో ఈరోజు ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ లో తమ యొక్క హైకోర్టు న్యాయవాది కే. వినయ్ కుమార్ ఆధ్వర్యంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ వంశీకృష్ణ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు లాయర్ వినయ్ కుమార్, మరియు ఖమ్మం జిల్లా TGJLA 475 అధ్యక్ష, కార్యదర్శులు కొండ వినోద్ బాబు, గుమ్మడి మల్లయ్య, రాష్ట్ర కౌన్సిలర్ కంచర్ల శ్రీకాంత్ రాష్ట్ర నాయకులు ప్రముఖ వాగ్గేయకారుడు వెంకట ముత్యం, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- UGC NET ADMIT CARDS – యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల
- JOST – దోస్త్ తరహాలో ఇంటర్ లో జోస్త్ ఆన్లైన్ అడ్మిషన్స్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 29 – 12 – 2024
- GK BITS IN TELUGU DECEMBER 29th
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 29