హైదరాబాద్ (డిసెంబర్ – 31) : ఈ మధ్య కాలంలో ఒక దిన పత్రికలో సీసీఈ అధికారులు 61 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్ధీకరణ చేయడం కొరకు ముడుపులు వసూలు చేసినట్టు వ్రాయడాన్ని TGDCLA రాష్ర్ట అధ్యక్షులు వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ డా. కిరణ్మయి, రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్, అరుణ, డా. శ్రీనివాస్, డా.కవిత తదితరులు ఖండించారు .
సదరు ఆరోపణలు రుజువు చేసినట్టయితే వెంటనే మేము మా రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కూడా రాజీనామ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలియచేశారు.
ఇలా పత్రికలలో నిరాధార ఆరోపణలతో వార్తలు రాయడం వలన పత్రికలు ప్రజలలో విశ్వాసం కోల్పోతాయని తెలియజేశారు. ఇలాగే ఇంతకు ముందు కూడా కమీషనర్ మరియు సీసీఈ అధికారులపై అసత్యపు వార్తలు రాశారని గుర్తు చేశారు.
ఇకపై పత్రికలలో ఆరోపణలు రాసే ముందు ఒకటికి రెండు సార్లు విచారణ చేసి ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే రాయాలని ఆ పత్రికల ఎడిటర్ గారికి విన్నపం చేశారు. ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా ముడుపులు తీసుకున్నారని నిరాధార వార్తల పట్ల నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.