INTER : అడ్మిషన్ల గడువు పెంపుకై వినతి – TGCLA

హైదరాబాద్ (జూలై – 24) : తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చేరటానికి అడ్మిషన్ల గడువును పొడిగించవలసిందిగా ఈరోజు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి గారికి ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA_475) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులు మొదటి సంవత్సరం అడ్మిషన్ చేరటానికి జూలై 25 వరకు మాత్రమే గడువు ఉన్నదని.. కానీ గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల ఈనెల 20, 21 22 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ఆకస్మిక సెలవులు ప్రకటించడం జరిగిందని. 23వ తేదీ ఆదివారం కావడం జరిగిందని… దీనివల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు కొంత ఇబ్బంది ఏర్పడిందని… ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందే గడువును పొడిగించవలసిందిగా గౌరవ తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ గారికి ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలియజేశారు.