హైదరాబాద్ (ఎప్రిల్ – 23) : తెలంగాణ రాష్ట్ర గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలు పొందేందుకు TGCET – 2023 ప్రవేశ పరీక్షను నేడు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు ఉదయం 10గంటలకు ముందే పరీక్ష కేంద్రానికి రావాలని అధికారులు సూచించారు.
గురుకులాల్లో ఉన్న 48,360 సీట్లను ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా భర్తీ చేయనున్నారు.