ఇంటర్ విద్య కమీషనర్ ను కలిసిన నాగర్ కర్నూల్ TGCCLA 711 సంఘం

నాగర్ కర్నూల్ కు విచ్చేసిన ఇంటర్ విద్య కమిషనర్ శ్రీ సయ్యద్ ఉమర్ జలీల్ ని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) లో కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు TGCCLA 711 సంఘం తరపున రాష్ట్ర కార్యదర్శి పి. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల పలు సమస్యలను మరియు క్రమబద్ధీకరణ అంశంపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమీషనర్ గారు సానుకూలంగా స్పందించారని రాష్ట్ర కార్యదర్శి పి. శ్రీధర్ బాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిజిసిసిఎల్ఏ 711 నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర కార్యదర్శి పి. శ్రీధర్ బాబు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Follow Us @