TG TET 2024 – నోటిఫికేషన్ వాయిదా

BIKKI NEWS (NOV. 05) : TG TET 2024 POSTPONED. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 నవంబర్ సెషన్ కు సంబంధించి ఈరోజు విడుదల కావలసిన పూర్తి నోటిఫికేషన్ వాయిదా పడింది. తెలంగాణ టెట్ వాయిదా పడింది.

TG TET 2024 POSTPONED

సాంకేతిక కారణాల వలన టెట్ 2024 పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు పద్ధతిని ఈరోజు విడుదల చేయలేకపోతున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

అయితే నవంబర్ 7వ తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసి ఆ రోజు నుంచే ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5 నుండి 20వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించవలసి ఉంది. ఈరోజు పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసి ఫీజు వివరాలు సిలబస్ తదితర అంశాలను వెలువరించాల్సి ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు