BIKKI NEWS (MAR. 09) : TG ICET 2025 NOTIFICATION. తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. 2025 – 26 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
TG ICET 2025 NOTIFICATION
అర్హతలు :
MBA – కనీసం 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) ఏదేని బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
MCA – ఇంటర్ డిగ్రీ స్థాయిలో గణితం చదివి ఉండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : మార్చి 10 నుంచి మే 03 వరకు.
250/- ఆలస్య రుసుముతో మే 17 వరకు
500/- ఆలస్య రుసుముతో మే 26 వరకు
దరఖాస్తు ఫీజు : 750/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 500/-)
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : మే 16 – 20 వరకు
హల్ టికెట్లు విడుదల : మే 28 నుంచి
ఐసెట్ పరీక్షల తేదీలు : జూన్ – 08, 09
ప్రాథమిక కీ : జూన్ – 22
తుది కీ : జూలై – 07
వెబ్సైట్ & దరఖాస్తు లింక్ : https://icet.tgche.ac.in/