BIKKI NEWS (APR. 10) : TG EAPCET 2025 APPLICATIONS. తెలంగాణ ఎఫ్‌సెట్ 2025 కు ఇంజనీరింగ్ విభాగంలో 2.16 లక్షలు, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగానికి 84 వేల మంది నేటి వరకు దరఖాస్తు చేశారు.
TG EAPCET 2025 APPLICATIONS
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎఫ్‌సెట్ అధికారులు ఈసారి కేవలం ‘ఎస్సీ’ అని కాకుండా అందులోని అన్ని కులాల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
వివిధ అపరాధ రుసుములతో ఎప్రిల్ 24వ తేదీ వరకు గడువుంది.
ఇప్పటివరకు ఇంజినీరింగ్ కు ఎస్సీ కులాలన్నింటి నుంచి 25,300, అగ్రికల్చర్ విభాగానికి 21,200 వచ్చాయి.
ప్రత్యేకించి మాదిగ విభాగంలో ఇంజినీరింగ్ కు 13,287 (52%), అగ్రికల్చర్ కు 12,763 (60%) మంది దరఖాస్తు చేశారు.
మాలల్లో ఇంజినీరింగ్ కు 30.31, అగ్రికల్చర్ లో 25.10 శాతం మంది దరఖాస్తులు సమర్పించారు. మిగిలినవి రెండు సామాజికవర్గాల్లోని ఉప కులాల నుంచి వచ్చినవి.
అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన ప్రకారం మాదిగలు అధికంగా ఉన్న గ్రూపు-2లోని 18 ఉపకులాలకు 9 శాతం, మాలలు అధికంగా ఉన్న గ్రూపు-3లోని 26 ఉప కులాలకు 5 శాతం, గ్రూపు-1లోని 15 ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్