TG DSC HALL TICKETS 2024

BIKKI NEWS (JULY 09) : TG DSC HALL TICKETS WILL RELEASE ON 11th JULY. తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ రాత పరీక్షల హాల్‌ టికెట్లు జూలై 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో పరీక్షలో వాయిదా లేనట్లు విద్యాశాఖ ప్రకటించినట్లు అయింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు డీఎస్సీ నిర్వహిస్తున్నారు

TG DSC HALL TICKETS WILL RELEASE ON 11th JULY

డీఎస్సీ పరీక్షలను జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటించింది.

పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, అలాగే గ్రూపు-2 పరీక్షలు ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకుల అంచనా.

వెబ్సైట్ :https://schooledu.telangana.gov.in/ISMS/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు