DSC CERTIFICATE VERIFICATION – డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్

BIKKI NEWS (SEP. 30) : TG DSC 2024 CERTIFICATE VERIFICATION SCHEDULE. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డీఎస్సీ 2024 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈరోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వరకు మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనుంది.

TG DSC 2024 CERTIFICATE VERIFICATION SCHEDULE

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి ఫోను ద్వారా సమాచారం అందించనున్నారు. అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వరకు జిల్లాలలోని జిల్లా విద్యాధికారి కార్యాలయాలలో ఈ ప్రక్రియ కొనసాగనుంది.

ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అర్హత సాధిచిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు