BIKKI NEWS (JUNE 22) : TG CABINET MEETING ON 23rd JUNE. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూన్ 23 మధ్యాహ్నం 3.00 గంటలకు జరగనుంది ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ నెలలో జరగనున్న మూడవ క్యాబినెట్ సమావేశం ఇది.
TG CABINET MEETING ON 23rd JUNE.
ఈ అత్యవసర క్యాబినెట్ సమావేశంలో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రాజెక్టు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు ప్రకటన కొరకు మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే దాని మీద క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అలాగే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్ళుతుండడంతో ్.. ప్రాజెక్టును ఎలా నిలుపుదల చేయాలి అనే అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు మీద ఇప్పటికే అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే్ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఈ ప్రాజెక్టుపై తెలంగాణ వాదనను వినిపించిన సంగతి తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్