TET VALIDITY ఇక శాశ్వతం

BIKKI NEWS : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఏడేళ్ళ వ్యాలిడిటిని తొలగిస్తూ శాశ్వత వ్యాలీడిటీ సర్టిఫికెట్లు అభ్యర్థులకు (tet life time validity certificates) ఇవ్వాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE) అన్ని రాష్ట్రాలకు సూచించింది.

ఈ శాశ్వత వ్యాలిడిటి 2011 ఫిబ్రవరి 11నుంచి నిర్వహించిన టెట్‌ పరీక్షలో అర్హత సాధించిన, గతంలో పేర్కొన్న ఏడేళ్ల నిబంధన కారణంగా టెట్‌ సర్టిఫికెట్‌ వ్యాలీడిటీ కోల్పోయిన అందరికీ ఈ శాశ్వత సర్టిఫికెట్లు జారీ చేయాలని పేర్కొంటూ NCTE ఉత్తర్వులు జారీచేసింది