టెట్ కు అనుమతి, అర్హతల్లో మార్పులు..

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతిచ్చింది. టెట్ అర్హతల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) ఆదేశాల మేరకు టెట్ పేపర్ -1కు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనని జీవో జారీ చేసింది. దీంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జిటీ ఉద్యోగాలకు బీఈడీ అభ్యర్థులకు అర్హత రానుంది. అయితే, ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎన్‌సీటీఈ మార్గదర్శకాల మేరకు టెట్ అర్హత కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి సవరించింది. రాష్ట్రంలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ నియామకాలకు వీలుగా ముందుగా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో సుమారు 3లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. రెండు రోజుల్లో పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

Follow Us @