BIKKI NEWS (MAY 05) : ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కోసం టెట్ ఉత్తీర్ణత నిబంధన వర్తించదని NCTE బోర్డు కార్యదర్శి కేషాంగ్ వై శర్పా స్పష్టం (tet qualification not required for head masters by ncte) చేశారు.
ఇందుకు సంబంధించిన రాత పూర్వక ఉత్తర్వులనం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బృందానికి అందజేశారు.
అలాగే 2010 ఆగస్టు 23 కు ముందు ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు అదే స్థాయిలో పదోన్నతులు పొందటానికి కూడా టెట్ ఉత్తీర్ణత అవసరం లేదనే విషయం ప్రస్తావించగా… ఇందుకు సంబంధించిన వివరణ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తమను అడగలేదని తెలిపినట్లు సమాచారం.