TET పరీక్షకు నూతన నిబంధనలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లో మార్పులకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE) చర్యలు చేపట్టింది.

జాతీయ విద్యా ప్రణాళిక (NEP) – 2020 ప్రమాణాల మేరకు 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయనున్నది. ఇందుకు ఒక కమిటీని నియమించిన NCTE మార్చి 31లోపు కొత్త టెట్‌ నిబంధనల రూపకల్పనకు కసరత్తు మొదలుపెట్టింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకొని తదనుగుణంగా నూతన మార్గదర్శకాలు రూపొందించాలని NCTE అభిప్రాయం.

ఈ నెల 15లోపు తమ అభిప్రాయాలు తెలుపాలని NCTE కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.

Follow Us@