టెట్ 2022 నోటిఫికేషన్ జారీ

  • బీఈడీ, డీఈడీ విద్యార్థులకు అవకాశం నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
  • జూన్ 12న పరీక్ష.. 27న ఫలితాలు
  • సిలబస్ 2017 టెట్ ప్రకారమే

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పించి నట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. శుక్రవారం టెట్ సమాచార బులెటిన్, సిలబస్ విడుదల చేశారు.

జూన్ 12న టెట్ నిర్వహించి, 27న ఫలితాలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 2017 సిలబస్ ప్రకారమే టెట్ నిర్వహించనున్నట్టు స్పష్టంచేశారు.

పేపర్-1, పేపర్ – 2 కు దరఖాస్తు రుసుము రూ.300గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రెండు పేపర్లు రాసేవారికి కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్థులు ఒకే దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే రెండు వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించే అవకాశం ఉన్నది. హాల్ టికెట్లను జూన్ 6 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల సందేహాలు సూచనలకు మార్చి 26 నుంచి జూన్ 12 వరకు హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో ఉంటాయి. వివరాలకు 040-23120340, 23120483, 8121010310 8121010410 నంబర్లలోమరియు tstet.cgg.gov.in వెబ్సైట్ లో సంప్రదించాలి.

Follow Us @