పది రోజుల్లో TET నోటిఫికేషన్.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు పది రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సారి ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నోటిఫికేషన్‌ విడుదల తర్వాత ప్రిపరేషన్‌కు 8 వారాలు సమయమిచ్చి పరీక్ష నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో సుమారు 50 వేల ఉద్యాగాలు భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో టీచర్‌, పోలీసు ఉద్యోగాలే ఎక్కువ కాగా, టీచర్‌ ఉద్యోగాల భర్తీకి టెట్‌ తప్పనిసరి కావడంతో, ఈ అర్హత పరీక్షను నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. మరో పదిరోజుల్లోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది.

ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు సార్లు టెట్‌ నిర్వహించారు. కాలపరిమితి ఏడేళ్లు కావడంతో ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన మూడు టెట్ల స్కోర్‌కు గడువు ఇప్పటికే తీరిపోయింది. అంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిపిన పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారే ఉపాధ్యాయ కొలువులకు నిర్వహించే టీఆర్‌టీకి అర్హులవుతారు. అందుకే మరోసారి పరీక్ష జరపనున్నారు.

ఈ సారి టెట్‌ పరీక్ష జరిపితే దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది బీఈడీ, డీఈడీ పూర్తయిన వారు హాజరయ్యే అవకాశం ఉంది.

Follow Us@