TESLA SELF DRIVING CAR – తనని తాను డెలివరీ చేసుకున్న కారు

BIKKI NEWS (JUNE 29) : Tesla Self driving car model Y. టెస్లా కంపెనీకి చెందిన మోడల్ వై కారు తనను కొనుగోలు చేసిన యజమాని దగ్గరికి 115 కిలోమీటర్ల వేగంతో సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ చేరుకుంది ఇందుకు సంబంధించిన వీడియోను టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Tesla Self driving car model Y

అటానమస్ మోడల్ వై కారు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నేరుగా తన ఓనర్ దగ్గరకు చేరుకుంది.

టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి నేరుగా చేరుకుంది.

మార్గమధ్యలో ట్రాఫిక్ సిగ్నల్, ఫ్లైఓవర్లు, హైవే లను దాటుకుంటూ కారు తన కొత్త యజమాని ఇంటికి సురక్షితంగా చేరుకుంది.

టెస్లా సంస్థ ఆ కారు ప్రయాణించిన విధానాన్ని కారులో ఉన్న కెమెరా ఆధారంగా రికార్డు చేసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు