BIKKI NEWS (JUNE 10) : ప్రధాన నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, ఈరోజు తన క్యాబినెట్ లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇందులో తెలంగాణ నుండి ఇద్దరికీ ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురికి మొత్తం ఐదుగురు తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నికైన వారికి క్యాబినెట్ లో మంత్రులు మరియు సహాయ మంత్రులుగా (Telugu states ministers in union cabinate 2024) అవకాశం దక్కింది.
తెలంగాణ రాష్ట్రం నుండి జీ. కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ కుమార్ లకు అవకాశం దక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ లకు చోటు దక్కింది.
అలాగే రాజ్యసభ సభ్యురాలు అయిన నిర్మల సీతారామన్ కు ఆర్థిక శాఖ మంత్రిగా మరోసారి అవకాశాన్ని నరేంద్ర మోడీ కల్పించారు.
కేబినెట్ హోదా మంత్రులు
1) నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ మంత్రి
2) జీ.కిషన్ రెడ్డి – బొగ్గు మరియు గనుల శాఖ
3) కింజరాపు రామ్మోహన్ నాయుడు – పౌరవిమానయాన శాఖ
సహయ మంత్రులు
1) బండి సంజయ్ కుమార్ – హోమ్ శాఖ సహాయ మంత్రి
2) పెమ్మాసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి & కమ్యూనికేషన్ సహాయ మంత్రి
3) భూపతి రాజు శ్రీనివాస్ వర్మ – ఉక్కు మరియు భారీ పరిశ్రమలు సహాయ మంత్రి