తెలంగాణ లోని కుమురం భీం జిల్లాలో పులి దాడి వలన ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో జాతీయ పులుల సంరక్షణ కేంద్రం(NTCA) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఆదిలాబాద్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ సి.పి.వినోద్‌కుమార్ ఛైర్మన్‌గా కమిటీని వేసింది. ఈ కమిటీ పెద్దపులులు సంచరించే అటవీ ప్రాంతాల సమీప గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది.