జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – V ప్రకారం తెలంగాణ గణాంకాలు

కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ తెలంగాణ రాష్ట్రంలో 2019-20 సంవత్సరానికి గాను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – V నివేదికను విడుదల చేసింది.

★ ముఖ్యాంశాలు ::

  • రాష్ట్రంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1007 మంది మహిళలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 1049కు పెరిగింది.
  • 15 ఏళ్లలోపు పిల్లల జనాభా 25.1% నుంచి 22.5% నికి తగ్గింది.
  • అక్షరాస్యత పురుషుల్లో 84.8%, మహిళల్లో 66.6%గా ఉంది.
  • అతి బరువు మహిళలు 30.1% మందిలో, పురుషుల్లో 32.3% ఉంది.
  • బాల్య వివాహాలు 26.2 నుంచి 23.5 శాతానికి తగ్గాయి.
  • శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సగటు కంటే ఎక్కువగా 18.8గా నమోదయ్యాయి.
  • నవజాత శిశు మరణాలు నాలుగేళ్లలో 1000 మందికి 20 నుంచి 16.8కి తగ్గాయి. నాలుగేళ్లలోపు వయసున్న శిశు మరణాలు 31.7 నుంచి 29.4కు తగ్గాయి.
Follow Us@