తెలంగాణ నుంచి జాతీయ పంచాయతీ అవార్డు-2021కు అర్హత సాధించిన గ్రామం ఏది.?

తెలంగాణ లోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారం గ్రామపంచాయతీ జాతీయ పంచాయతీ అవార్డు-2021కు అర్హత సాధించింది.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరుచేసే నిధులను సక్రమంగా వినియోగించుకున్న జీపీలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేస్తారు. 2018-19 సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులకు గాను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) అవార్డుతో పాటు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్‌ అవార్డులు సాధించింది.

Follow Us @